Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘చలో విజయవాడ’ విజయవంతం

ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమం ఆగదు : పీఆర్సీ సాధనసమితి నేతలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు చేపట్టిన ‘చలో విజయవాడ’ విజయవంతమైనట్లు నేతలు ప్రకటించారు. అక్కడక్కడ పోలీసులు విజయవాడకు రాకుండా అడ్డుకున్నప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులు నగరానికి తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్జీవో భవన్‌ నుంచి అలంకార్‌ థియేటర్‌ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డు వైపునకు ర్యాలీగా ముందుకు సాగారు. అనంతర ఏర్పాటు చేసిన సభలో పీఆర్సీ సాధన నేతలు మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఉద్యోగులు తరలివచ్చారని, పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతామని అన్నారు. పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం దిగివచ్చేవరకు ఉద్యమన్ని కొనసాగిస్తామని అన్నారు. మరో నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పీఆర్సీ అంశంలో సీఎం జగన్‌ నేరుగా ఉద్యోగులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వితండవాదాన్ని వీడనాడి మాయలెక్కల నుంచి బయటకు రావాలని, వాస్తవాలను అంగీకరించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img