Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తన ఆస్తి మొత్తాన్ని జీజీహెచ్‌ ఆసుపత్రికి రాసిన డాక్టర్‌

అమెరికాలో ఉంటోన్న ఓ తెలుగు డాక్టర్‌ తాను కష్టపడి దాచిన తన యావదాస్తిని గుంటూరు జీజీహెచ్‌ హాస్పటల్‌ కి దానంగా ఇచ్చారు. భర్త మూడేళ్ల కిందట చనిపోవడం.. ఆమెకు వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవని తన ఆస్తిని ఆస్పత్రికి ఇచ్చేశారు. మొత్తం రూ.20 కోట్ల ఆస్తిని జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి గవిని ఉమా విరాళం ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమ గుంటూరు మెడికల్‌ కాలేజీలో 1965లో మెడిసిన్‌ చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య పూర్తి చేసి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి.. అక్కడే స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా స్ధిరపడ్డారు. అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాలకు వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img