Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశముందని, పలు ప్రాంతాల్లో ఎండలతో పాటు, వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలోని ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. దేశంలో పలు ప్రాంతాలతో పాటు.. హిమాలయ పర్వతాల్లోనూ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయని ఐఎండీ స్పష్టం చేసింది. మరో వైపు మార్చి నుంచే మండిపోతున్న ఎండలు దశాబ్దాల రికార్డులను బద్దలు కొడుతున్నాయి. . 1901 తర్వాత ఈ మార్చిలో అంటే 122 ఏళ్ల తర్వాత దేశంలో మార్చి నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సరాసరి 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డు చెరిగిపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img