Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతాం? : వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాగడానికి నీళ్లు లేవని, రోడ్లపై గుంతలు పూడ్చలేకపోతున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ఏం పనిచేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతాం? అని ఆనం వ్యాఖ్యానించారు. కండలేరు రిజర్వాయర్‌ దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయామని పేర్కొన్నారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్సార్‌ కల నెరవేర్చలేకపోయామని ఆనం విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఎస్‌ఎస్‌ కెనాల్‌ కడతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, ఇన్నేళ్లయినా కెనాల్‌ గురించి పట్టించుకోలేదని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని, ఎస్‌ఎస్‌ కెనాల్‌ గురించి ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు చెప్పామని, అసెంబ్లీలోనూ ప్రస్తావించామని, చీఫ్‌ ఇంజినీర్ల భేటీలోనూ ప్రస్తావించామని ఆనం వెల్లడిరచారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఎస్‌ఎస్‌ కెనాల్‌ పరిస్థితి ముందుకు కదల్లేదని పేర్కొన్నారు. ఒక అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్రం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారన్నారు. కేంద్రం నిధులు ఇస్తే మనం ఏం చేస్తున్నామని అన్నారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లడుగుతామని అన్నారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చిందన్నారు. లే ఔట్లు వేశాం.. ఇళ్లేమన్నా కట్టామా అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img