Friday, April 26, 2024
Friday, April 26, 2024

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహాోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 5వ తేదీ వరకూ పది రోజులు అమ్మవారు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు దుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు. 2వ తేదీ మూలానక్షత్రం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్‌ 5న దుర్గాదేవిని హంసవాహనంపై కృష్ణా నదిలో ఊరేగిస్తారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నది స్నానాలను పూర్తిగా నిషేదించి ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. యాత్రికులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాలు, పున్నమిఘాట్‌, భవానీఘాట్‌ వద్ద తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img