Friday, April 26, 2024
Friday, April 26, 2024

న్యాయం కోరితే మాకే నోటీసులిస్తారా?

టీడీపీ సీనియర్‌ నేత బొండా ఉమా
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటన అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. యువతిపై అత్యాచార ఘటనలో న్యాయం కోరితే తమకే నోటీసులిస్తారా అని టీడీపీ సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు. ‘విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అభాగ్యురాలిపై అత్యాచారం చేసిన రాక్షసులను ఏమి చేయలేక.. పరామర్శించడానికి వెళ్లిన మాపై మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేయడం దారుణం. లేని దిశ చట్టాన్ని ఉందని మహిళలను మోసం చేస్తూ.. మహిళల భద్రతను గాలికి వదిలేసిన జగన్‌ రెడ్డికి పంపించండి ముందు నోటీసులు..’ అంటూ బోండా ఉమా ఫైర్‌ అయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాసిరెడ్డి పద్మపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తే.. తమకు మహిళా కమిషన్‌ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు వస్తున్నారనే.. ప్రభుత్వం నిద్ర లేచిందన్నారు.
విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమాలకు రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీచేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img