Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళలను కించపరచడం సమాజానికి మంచిదికాదు : నారా భువనేశ్వరి

వరద బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అర్థిక సాయం అందజేత
సమాజానికి న్యాయం చేయాలని, నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరువని వ్యక్తి ఎన్టీఆర్‌ అని..ఆయన వారసత్వాన్ని తమ ట్రస్టు ముందుకు తీసుకెళుతుందని అన్నారు. సోమవారం భువనేశ్వరి తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 48 మంది వరద బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని నారా భువనేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని, ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదామని ఆమె పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని..ట్రస్ట్‌గా ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించడం లేదని భువనేశ్వరి చెప్పారు. ఇతర సంస్థలను కలుపుకొని ముందుకెళతామని అన్నారు. వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరచడం సమాజానికి మంచిదికాదు. నాపైన జరిగిన దాడికంటే, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు దారుణంగా ఉన్నాయి. నాపై జరిగిన దాడి తర్వాత నాలాగే దాడికి గురవుతున్న మహిళల వ్యథ మరింతగా అర్థమైంది. మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు బాధాకరం. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని తల్లి, చెల్లిని ఎలా చూస్తారో సమాజంలోని మహిళలను అలాగే చూడాలని అన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి ఉండేలా ఓ తల్లిగా లోకేష్‌ను పెంచానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img