Friday, April 26, 2024
Friday, April 26, 2024

రంగాది వ్యవస్ధ చేసిన హత్య-హంతకులంతా టీడీపీలోనే -కొడాలి కామెంట్స్‌

ఏపీలో వంగవీటి రంగా కేంద్రంగా మరోసారి తెరపైకి వచ్చిన రాజకీయాలపై ఇవాళ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. రంగా చావుకు టీడీపీయే కారణమన్నారు. ఆయన పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్దితి టీడీపీదన్నారు. సొంత పార్టీ వాళ్లనే చంపి దండలు వేసే చరిత్ర టీడీపీదన్నారు. రంగాను పొట్టనబెట్టుకున్న పార్టీలు ఆయన బూట్లు నాకుతున్నారని టీడీపీని ఉద్దేశించి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రంగాను చంపిన వారే ఆయన బూట్లు నాకుతున్నారన్నారు. రంగాది వ్యవస్ధ చేసిన హత్య రంగాను తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నించారని అప్పటి పరిస్దితుల్ని కొడాలి నాని గుర్తుచేసుకున్నారు.రంగా ఓ వ్యక్తికాదు వ్యవస్ధ అని ఆయన అన్నారు. రంగాకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి, గన్‌ మెన్లు ఇవ్వకుండా హత్యచేశారని తెలిపారు. రంగాను చంపే శక్తి వ్యక్తులకు లేదని, అది వ్యవస్ద చేసిన హత్య అన్నారు. రంగా హత్యను జగన్‌ పై, నాపై రుద్దే ప్రయత్నం చేయొద్దని కోరారు. రంగా హత్యలో అప్పటి మీడియా పాత్ర ఉందన్నారు. రంగా హత్యలో టీడీపీ వంగవీటి రంగాను చంపిన హంతకులంతా టీడీపీలోనే ఉన్నారని కొడాలి ఆరోపించారు. వైసీపీలో ఎవరూ లేరన్నారు. రంగా హత్య తర్వాత రావి శోభనాద్రి ఓడిపోలేదా అని ప్రశ్నించారు. రంగా హత్య తర్వాత ఎవరి ఆస్తులపై ఆయన అభిమానులు దాడులు చేశారని కొడాలి ప్రశ్నించారు. రంగా హత్యారోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణ, దేవినేని ఉమ ఏ పార్టీలో ఉన్నారని నిలదీశారు. రంగా హత్య తర్వాత అప్పటి గుడివాడ ఎమ్మెల్యే రావి శోభనాద్రి ఓడిపోలేదా అని కొడాలి అడిగారు. రంగా హత్య తర్వాత రాధాను పిలిచి తాను 10 విగ్రహాలు పెట్టించానని, రావి వెంకటేశ్వరరావు, ఆయన తండ్రి ఎన్ని విగ్రహాలు పెట్టించారని కొడాలి ప్రశ్నించారు. గతంలో రంగా విగ్రహాలు పెట్టిస్తే తనపై కేసులు పెట్టారని గుర్తుచేశారు.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న రంగా కుమారుడు రాధాతో తనకు పార్టీలకు అతీతంగా స్నేహం ఉందని కొడాలి నాని తెలిపారు. రాధా వైసీపీని వీడటానికీ, రంగా హత్యకు సంబంధం లేదన్నారు. రాధాతో ప్రయాణం పార్టీలకు అతీతం..రాధా తమ కుటుంబసభ్యుడన్నారు. రాధాను ప్రత్యేకంగా ఓన్‌ చేసుకునేదేమీ లేదన్నారు. టీడీపీతో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్‌ పీకాడని గుర్తుచేసుకున్నారు. కానీ తాము మాత్రం రంగా అభిమానులుగా ప్రాణం ఉన్నంతవరకూ ఆయన ఆశయాల కోసం పోరాడతామన్నారు. రాధాతో కలిసి ఎన్నో రంగా విగ్రహాలు ప్రారంభిస్తున్నట్లు, ఇది పార్టీలకు అతీతంగానే చేస్తున్నట్లు కొడాలి తెలిపారు. జగన్‌ రాజకీయమిదే ? ఈ సందర్భంగా ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ రాజకీయంపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఏ పార్టీతో పొత్తులు అక్కర్లేదని కొడాలి తెలిపారు. చంపేసిన నాయకులకు డందలేయమని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్‌ సోనియాతోనే పోరాడి గెలిచారని, పది ఓట్లు కూడా లేని వ్యక్తులతో పోరాడతామా అని ప్రశ్నించారు. నచ్చితే వైసీపీకి ఓట్లేయండి, లేకపోతే పక్కనబెట్టమని జగన్‌ చెప్తున్నారని గుర్తుచేశారు. టీడీపీ మాత్రం రంగాను హత్యచేసి ఇప్పుడు ఓన్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ కొడాలి ఫైర్‌ అయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img