Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాజ్యసభ చైర్మన్‌ స్థానంలో విజయసాయిరెడ్డి

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత..రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు స్థానంలో సాయిరెడ్డి సభను నిర్వహించే ఛాన్స్‌ దక్కించుకున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 10వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఉపరాష్ట్రపతికి ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ నుంచి ధన్‌ కర్‌.. విపక్షాల నుంచి మార్గరేట్‌ అల్వా ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉపరాష్ట్రపతిగా గెలిచినవారు రాజ్యసభ ఛైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. దీంతో..వెంకయ్య నాయుడు కొద్ది రోజుల క్రితం రాజ్యసభకు కొత్త ప్యానెల్‌ స్పీకర్లను ప్రకటించారు. అందులో వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్న విజయ సాయిరెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో..ఈ రోజు సాయిరెడ్డి ఛైర్మన్‌ స్థానంలో తొలి సారి ఆశీనులై సభను నడిపించారు. తొలి సారిగా ఛైర్మన్‌ స్థానంలోకి వచ్చిన విజయ సాయిరెడ్డికి సభ్యులు స్వాగతం పలికారు. తనకు అరుదైన అవకాశం దక్కడంపై విజయసాయి సోషల్‌ మీడియాలో స్పందించారు.తొలిసారిగా రాజ్యసభను నడిపించే అవకాశం దక్కడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆరేళ్ల కిందట రాజ్యసభలో వైసీపీ తరఫున ఒకే ఒక్కడ్ని ఉండేవాడ్నని, ఇప్పుడిలా చైర్మన్‌ స్థానంలో సభను నడిపించే భాగ్యం లభించిందని వివరించారు. ఇదంతా కూడా జగన్‌, భారతమ్మ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img