Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో మూడు రోజులు విస్తారంగా వర్షాలు

రానున్న మూడురోజులు రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిరది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించనుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు వెల్లడిరచారుగురువారం నుంచి 30వ తేదీ వరకు మూడురోజులు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించారు.29, 30 తేదీల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img