Friday, April 26, 2024
Friday, April 26, 2024

రైతుల మహా పాదయాత్రలో లాఠీఛార్జ్‌.. ఉద్రిక్తత..

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. అమరావతి రైతులకు సంఫీుభావం ప్రకటించేందుకు వస్తే అడ్డుకోవడానికి మీరెవరంటూ స్థానికులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన రైతు చేయి విరిగింది. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు గాయపడినట్లు సమాచారం. కాగా నాగులుప్పలపాడులో రాజధాని రైతుల మహాపాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఉదయం పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకున్న జిల్లా పోలీస్‌ యంత్రాంగం..ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉన్నందున ఇతరులు పాదయాత్రలో పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని తెలిపారు. మేరకు అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది.
కాగా రైతుల పాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై లాఠీ ఛార్జ్‌ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండిరచారు పాదయాత్రను అణచివేసేందుకు జగన్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మహా పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న స్పందన చూసి జగన్‌కు భయం పట్టుకుందన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వారిపై లాఠీ ఛార్జ్‌ చేయడం దారుణమన్నారు. 13 జిల్లాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అమరావతిని నిలిపివేసి…3 రాజధానుల పేరిట విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్లు దిగ్భందించి పాదయాత్రకు ఆటంకం కలిగించడం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకోవడం మానుకోవాలన్నారు. లాఠీఛార్జ్‌లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img