Friday, April 26, 2024
Friday, April 26, 2024

వంశీ క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషయం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషయమని సీపీఐ నేత నారాయణ అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారం తీరు అన్యాయం, దురదృష్టకరమన్నారు. కుటుంబ పెద్దగా వ్యవహరించి కంట్రోల్‌ చేసి ఉండాల్సిందన్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుఖించకుండా హుందాగా వ్యవహరించాల్సిందని అన్నారు. ఏం తప్పుచేశారని 12 మంది సభ్యులను రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేశారు..? అని ఈ సందర్భంగా నారాయణ ప్రశ్నించారు. బానిసలా వ్యవహరించకుండా వెంకయ్య నాయుడు వారి సస్పెన్షన్‌ ఎత్తివేయాలన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన 750 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నారాయణ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img