Friday, April 26, 2024
Friday, April 26, 2024

వాళ్లను చంపేస్తారని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం : చంద్రబాబు

వైసీపీ నేతల అవినీతి, దాష్టీకాలకు ఈ మూడేళ్లలో అనేకమంది చనిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శాంతియుతంగా ఉండే రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని మండిపడ్డారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోతున్నారని అన్నారు. శ్రీనివాస రెడ్డి, గంగిరెడ్డి, గంగాధర్‌ రెడ్డిల వరుస మరణాల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లని చంపేస్తారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందని, వాళ్లు కరుడుగట్టిన నేరగాళ్లని.. పరిటాల రవి విషయంలో ఇలాగే చేశారన్నారు. ‘సీబీఐకి ఇది సవాల్‌.. సీబీఐ విశ్వసనీయతకే పెను సవాల్‌’ అని చంద్రబాబు అన్నారు. జగన్‌ అవినీతిపై సీబీఐ ఛార్జ్‌ షీట్‌ వేసినా ఏం చేయలేకపోయిందన్నారు. సీబీఐ ఏం చేయలేకపోతుంటే.. ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. నేరగాళ్లు రాజ్యం చేస్తోంటే సీబీఐ వంటి సంస్థలు కాపాడకుంటే ఎలా..? అని నిలదీశారు. పల్నాడులో హత్యలు జరుగుతూనే ఉన్నాయని, గతంలో చంద్రయ్యను హత్య చేశారు.. ఇప్పుడు జల్లయ్యను చంపేశారు… కనీసం టీడీపీ నేతలను పరామర్శించడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలను ఇల్లీగల్‌ డిటెన్షన్‌ చేస్తారా..? ఇది రాజ్యాంగ విరుద్దమని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని చంపేసి.. ఇంటికి డెడ్‌ బాడీ పంపి.. అంత్యక్రియలు చేసుకోమన్నారని, ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతబాబు ఎపిసోడ్‌ నుంచి దృష్టి మళ్లించడానికి కోనసీమలో అల్లర్లు సృష్టించారని, కోనసీమలో ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img