Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వాహనదారులు ఆందోళన చెందొద్దు.. మరో ఛాన్స్‌ కల్పిస్తాం

మంత్రి పేర్నినాని
రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పేర్నినాని సూచించారు.వాహనదారులు ఇప్పుడు కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా.. ప్రస్తుత టాక్సులనే చెల్లించేలా అవకాశం కల్పించినట్టు వెల్లడిరచారు.దీనికోసం జనవరి 1కి ముందు వాహనం కొనుగోలు చేసినట్టు తగిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ ఆదేశాన్ని ఇప్పటికే వివిధ జిల్లాల రవాణాశాఖ అధికారులు, డీలర్లకు తెలియజేసినట్టు చెప్పారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని, మరో ఛాన్స్‌ కల్పిస్తామని చెప్పారు. రవాణాశాఖ వెబ్‌సైట్‌లో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ కారణంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వెహికల్స్‌ కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ల ఛార్జస్‌ పెరగనున్నాయి. ఈనేపథ్యంలో.. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ఆసక్తి చూపారు. వెహికల్‌ డెలివరీ చేయకపోవడంతో పలు చోట్ల వినియోగదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img