Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ సమావేశం

గడపగడపకూ మన ప్రభుత్వ్ణం, ్షజగనన్నే మన భవిష్యత్త్ణుపై ఎమ్మెల్యేలతో కలిసి జగన్‌ సమీక్ష
ఎమ్మెల్యేల పనితీరునూ సమీక్షించనున్న సీఎం
కేబినేట్‌లో మార్పులపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌.. పార్టీ ఎమ్మెల్యేలతో నేడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌.. ్షగడపగడపకూ మన ప్రభుత్వ్ణం, ్షజగనన్నే మన భవిష్యత్త్ణు తదితర కార్యక్రమాలను సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం అధారంగా వారికి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటూ నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయ కర్తలు కూడా పాల్గొననున్నారు . పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్‌ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పనితీరు మార్చుకోవాలంటూ సీఎం సూటిగా చెప్పే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. కేబినెట్‌ కూర్పులో మార్పులు ఉంటాయని సీఎం జగన్‌ గతంలోనే హింట్‌ ఇచ్చారు. దీంతో నేడు జరగబోయే సమీక్షా సమావేశంలో ఈ విషయమై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో.. నేటి సమావేశంలో ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ ఏపీలో నెలకొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img