Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సోషల్‌ మీడియాపై సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌.. తెరపైకి సజ్జల కుమారుడి పేరు

2024 ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు కసరత్తులు ముమ్మరం చేసిన తరుణంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. సోషల్‌ మీడియా వింగ్‌ సభ్యులతో సీఎం జగన్‌ మంగళవారం సమావేశమయ్యారు. అయితే, ఈసారి సోషల్‌ మీడియా బాధ్యతలు చూడటానికి కొత్త పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డికి సోషల్‌ మీడియా బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియా వింగ్‌ నేతలతో భేటీలో భార్గవ రెడ్డి కూడా పాల్గొన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో కౌంటర్‌ స్ట్రాటజీ టీం అవసరం అని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. మీడియా, సోషల్‌ మీడియా బాధ్యతలు ఒకరి వద్ద ఉంటేనే సమన్వయంగా స్పందించటానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది. విపక్షాల నుంచి సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై అటాక్‌ పెరగడంతో.. అంతకు రెట్టింపు ప్రతిస్పందనలో తమ టీమ్‌ నుంచి ఉండాలని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో, సోషల్‌ మీడియా వింగ్‌పై సీఎం జగన్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img