Friday, August 12, 2022
Friday, August 12, 2022

వచ్చే ఏడాదే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : రఘురామ

2023లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ సర్వేలో ప్రతిపక్షానికి 115, పాలక పక్షానికి మిగతా సీట్లు వస్తాయని తేలిందని తెలిపారు. ఏడుగురు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లలేదని సీఎం జగన్‌ అన్నారని, ఏడుగురు కాదు 8 మంది ఎమ్మెల్యేతో పాటు జగన్‌ కూడా గడపగడపకు వెళ్లలేదని తెలిపారు. టీడీపీ హయాంలో 93 శాతం మంది విద్యార్థులు టెన్త్‌ పాస్‌ అయ్యారని, తమ ప్రభుత్వంలో టీచర్లపై మానసిక ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి వివేకా కేసులో సీబీఐ విచారణ లేటైతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కోనసీమ ఘటనపై హోంమంత్రికి లేఖ రాస్తానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img