Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

55 వేల మంది నివసించే చోట సారా తయారీ సాధ్యమా?

: సీఎం జగన్‌
సారా కాసేవాళ్లపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో మరణాలపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ, 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో.. సారా తయారీ చేయడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. వార్డు సచివాలయం, కార్పొరేటర్లు, పోలీస్‌ స్టేషన్‌ ఉందని.. ఇలాంటి మున్సిపాలిటీలో నాటు సారా కాయడం సాధ్యమేనా? అని మరోసారి సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఏదో మారుమూల గ్రామంలో సారా కాస్తున్నారంటే ఆలోచించాల్సిన విషయమన్నారు. సారా కేసేవాళ్లకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు. సభ్యులు సభలో హుందాగా ప్రవర్తించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img