Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

భూముల రీసర్వే నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి


కలెక్టర్ విజయకృష్ణన్

విశాలాంధ్ర – బాపట్ల : భూముల రీసర్వే ప్రక్రియ ఆయా గ్రామాల్లో నిర్ధేశించిన గడువులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. విజయకృష్ణన్ తెలిపారు. రీసర్వే ప్రక్రియపై మండల సర్వేయర్లతో మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
బాపట్ల జిల్లాలో సర్వే పూర్తి చేసిన భూములలో ఈ నెల 31వ తేదీలోగా హద్దురాళ్లు వేయాలని కలెక్టర్ చెప్పారు. హద్దురాళ్లు వేసే ప్రక్రియపై సర్వే అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జె. పంగులూరు, చందలూరులో ఏడు వేల ఎకరాల భూములు సర్వే మిగిలి పోవడంపై ఆరా తీశారు. జాగర్లమూడి, యద్దనపూడిలో సర్వే ప్రక్రియ జాప్యం పై ఆరాతీశారు. చినగంజాం మండలం కడవకుదురు గ్రామంలో సర్వే పనులు ఊపందుకోవాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో మండల సర్వేయర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సచివాలయాలలో భూముల సర్వే కోసం వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సర్వే ప్రక్రియలో గ్రామసర్వేయర్లు చురుకుగా పనిచేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కోలలపూడి గ్రామంలో 890 హద్దురాళ్లు వేయాల్సి ఉండగా ప్రస్తుతం 520 హద్దురాళ్లు వేయడంపై ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడుసుమల్లి గ్రామంలో నాలుగు రోజుల్లో హద్దురాళ్లు వేయడం పూర్తి చేయాలన్నారు. అధికారులు, సర్వేయర్లు సర్వే ప్రక్రియపై నిర్లిప్తిత వీడాలని ఆమె పలు సూచనలు చేశారు. అనంతరం మండలాలు, గ్రామాల వారీగా సర్వే ప్రక్రియపై జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సమీక్షించారు. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏ.డి. మురళీకృష్ణ, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img