Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

గవర్నర్‌తో అసత్యాలు పలికిస్తున్నారు… ఏపీ అసెంబ్లీలో గందరగోళం ..

సభలో టీడీపీ సభ్యుల నినాదాలు.. వాకౌట్
ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటుపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. కల్పిత లెక్కలను గవర్నర్‌తో జగన్ సర్కార్చెప్పిస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. కేబినెట్‌లో 70శాతం బీసీలకు అవకాశం ఇచ్చామని గవర్నర్ తెలిపారు. గవర్నర్‌తో అన్నీ అసత్యాలే పలికిస్తున్నారని సభ నుంచి టీడీపీ నేతలు వాకౌట్ చేశారు.దిశా యాక్ట్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నామని గవర్నర్ చెప్పగా… దిశా యాక్ట్ పెద్ద ఫేక్ అని, దీనిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది అని టీడీపీ పేర్కొంది. అలాగే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో రైతులకు ఒరిగిందేమీ లేదంటూ తెలుగుదేశం సభ్యులు కేకలు వేశారు. ప్రాజెక్ట్‌ల అంశానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్ట్‌లో పురోగతి, 54 ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో 14 పూర్తి చేశామని గవర్నర్ తెలిపారు. గవర్నర్ వ్యాఖ్యలతో సభలో పలుమార్లు టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అసత్యాలు భరించలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ సభ్యులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గవర్నర్ వెయిట్.. వెయిట్ అంటూ ఇరు పార్టీల సభ్యులను శాంతిపజేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి వచ్చారన్న విషయాన్ని విస్మరించి గవర్నర్ చేత అసత్యాలు చెప్పిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img