Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తుది నివేదిక అందిన తర్వాత ఏపీకి వరద సాయం

హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌
భారీ వర్షాలపై నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 23న వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడిరచారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 25 మంది మరణించినట్లు, రోడ్లు, విద్యుత్‌ వ్యవస్థతోపాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపిందని ఆయన చెప్పారు.కంద్ర ప్రభుత్వం నవంబర్‌ 23న వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఈ బృందం నవంబర్‌ 26 నుంచి 29 వరకు భారీ వర్షాల ప్రభావానికి గురైన ప్రాంతాలను సందర్శించి జరిగిన నష్టాన్ని మదింపు చేసిందని, దీనిపై ఆ బృందం తుది నివేదిక సమర్పించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా ఆర్థిక సహాయం అందించే అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని మంత్రి వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img