Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పద్మభూషణ్‌తో.. మరింత బాధ్యత పెరిగింది..చినజీయర్‌ స్వామి

వికాస్‌ తరంగిణి..జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్‌ స్వామి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.ఈ అవార్డు రావడంపై చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. వికాస తరంగిణి, జీయర్‌ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అని తెలిపారు. ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని ఆచరించినా సరే సామాజిక సేవ విషయంలో అంతా కలిసి పనిచేయాలనే లక్ష్యంతో ్షస్వీయ ఆరాధన, సర్వ ఆదరణ్ణ నినాదం తీసుకొచ్చామని చినజీయర్‌ స్వామి తెలిపారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ, ఇతర ధర్మాలను ఆదరిస్తూ కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా సేవ చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్పందించి, సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img