Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

మత్స్యకారుల ద్వారా చెరువుల నిర్వహణ చేపట్టాం

ఎంపీ మోపిదేవి వెంకటరమణ
మత్స్యకారుల ద్వారా చెరువుల నిర్వహణ చేపట్టామని, అందుకోసం వందల ఎకరాలు పైబడిన చెరువలను ఎంపిక చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. చెరువులపై ఆధారపడి జీవించే వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ప్రభుత్వం ఆశించిందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో చెరువులపై ఆధారపడి జీవించే వారి కోసం జీవో 217 తీసుకొచ్చామని తెలిపారు. 100 హెక్టర్స్‌ పైనున్న 28 చెరువులను దీని కిందకు తీసుకొచ్చాన్నారు. వాటిని అధ్యయనం చేసి సొసైటీ సభ్యులకు కనీసం రూ.15000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాను ఆ జీవో కింద తీసుకున్నామని తెలిపారు. ఇది నెల్లూరు జిల్లాకు మాత్రమే వర్తిస్తుంది అని జీవోలో స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. అక్కడ అమలు చేసి మంచి ఫలితాలు వస్తే అప్పుడు ఆలోచించాలని భావించామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img