Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆర్థికంపై ఆసియా మంత్రుల చర్చ

నామ్‌ పెన్‌: కరోనా వ్యాక్సిన్‌ పరిశోధన, ఉత్పత్తిలో ప్రాంతీయ సహకారాన్ని, ఆరోగ్య వ్యవస్థ మెరుగుదలకు 55వ ఆసియా సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం(ఏఎమ్‌ఎమ్‌`55) పిలుపునిచ్చింది. కంబోడియాలోని నమ్‌ పెన్‌లో మూడురోజులపాటు జరిగే ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న కంబోడియా ప్రధాని సామ్‌దేక్‌ టెకో హన్‌సెన్‌ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణ, ప్రాంతీయ భద్రత, మైన్మార్‌ అంశం, ఉక్రెయిన్‌ యుద్ధం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’’ అనే స్ఫూర్తితో సమ్మిళిత, సహకార సంఘాన్ని నిర్మించడానికి కృషి చేయాలని హున్‌ సేన్‌ అన్నారు. అసియా దేశాలు సంఫీుభావాన్ని కొనసాగించాలని, ఐక్యతతో వ్యవహరించాలని మంత్రులు అంగీకరించారు. అంతర్జాతీయ సహకారానికి సంబంధించి, ఆసియా దౌత్యవేత్తల కూటమి సమతుల్య విధానాన్ని తీసుకోవాలని, ఉమ్మడిగా ఉండాలని, ఆసియా దేశాల నేతృత్వంలోని యంత్రాంగాలను సమర్థవంతంగా ప్రోత్సహించాలని, చర్చలు జరపాలని, అంతర్జాతీయ చట్టాలతో విశ్వాసం, సమ్మతిని పెంచాలని నొక్కి చెప్పారు. మైన్మార్‌లో పరిస్థితిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఐదు అంశాల ఏకాభిప్రాయాన్ని అమలు చేయడాన్ని మంత్రులు స్వాగతించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా తీవ్రమైన ఆర్థిక పర్యవసానాలు ఎదురయ్యాయని, ఆహార, ఇంధన భద్రతకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయని, మరోసారి ప్రపంచ దేశాలు చీలిపోయే ప్రమాదమేర్పడిరదని హన్‌సెన్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ తర్వాత రెండేళ్ళలో మొదటిసారిగా ఆసియా విదేశాంగ మంత్రులు, వారి ప్రతినిధులు ముఖాముఖి సమావేశమయ్యారని కంబోడియా డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ప్రాక్‌ సోకోనన్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img