Monday, May 6, 2024
Monday, May 6, 2024

మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవి.

విశాలాంధ్ర ధర్మవరం:: మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ డెండెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణములో వీరి ఆధ్వర్యంలో ప్రజల అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమ సమాజం కోసం మలేరియాకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయాలని తెలిపారు. దోమతెరల ద్వారా అంటూ వ్యాధులను తరిమికొట్టాలని ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడి, దోమ కాటును నివారించాలని తెలిపారు. చిన్న దోమ పెద్ద ప్రమాదం వేపాకు పొగ దోమలకు సెగ అన్న నినాదంతో ముందుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తప్పక మలేరియా వ్యాధిపై అవగాహన కల్పించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. మలేరియా వ్యాధి నాలుగు రకాలుగా వ్యాపిస్తుందని తెలిపారు. మలేరియా వ్యాధి లక్షణాలు ఒళ్ళు నొప్పులు చలి జ్వరం తలనొప్పి అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ జయరాం నాయక్, డాక్టర్ నజీర్, డాక్టర్ సురేష్ నాయక్ ,డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్వేత, డాక్టర్ ప్రియాంక, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలకు మలేరియా పై అవగాహన:: మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గోట్లురు గ్రామములో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పుష్పలత ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలకు అవగాహన నిమిత్తం ర్యాలీని నిర్వహించారు. అనంతరం డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, మలేరియా, లార్వాలు ఎలా వృద్ధి చెందుతాయి అన్న వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. దోమతెరలు వాడాలని, వేపాకు పొగ వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు రాజశేఖర్ రెడ్డి, జైతున్ బి, ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్ హెచ్పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img