Friday, April 26, 2024
Friday, April 26, 2024

కాంటినెంటల్‌ టైర్స్‌ నూతన శ్రేణి టైర్ల విడుదల

ముంబయి: సుప్రసిద్ధ ప్రీమియం టైర్‌ తయారీదారు కాంటినెంటల్‌ టైర్స్‌ తమ మోడిపురం ప్లాంట్‌ వద్ద ప్యాసెంజర్‌, వాణిజ్య వాహన విభాగాల కోసం పలు నూతన ఆర్టికల్స్‌ను తయారుచేయడం ప్రారంభించింది. కంపెనీ స్థానికీకరణ కార్యక్రమాలకు అనుగుణంగా ఇది ఉండటంతో పాటుగా భారత ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి ఇది మద్దతునందిస్తుంది. కాంటినెంటల్‌ టైర్స్‌ ఇండియా ఇప్పుడు ప్రీమియం సెడాన్స్‌, ఎస్‌యువీల కోసం 19 అంగుళాలు, 20 అంగుళాల రిమ్‌ సైజ్‌ ఆర్టికల్స్‌ను తయారుచేస్తుంది. అంతేకాదు, ఈ కంపెనీ ఇప్పుడు డిజిటల్‌ పరిష్కారాలను సైతం పరిచయం చేసింది. భారతదేశంలో వాణిజ్య వాహన విభాగం కోసం కాంటి360 ఫ్లీట్‌ సొల్యూషన్స్‌కు ఇది అదనపు విలువ జోడిస్తుంది. భారతీయ ప్యాసెంజర్‌ వాహన విభాగం గత కొద్ది సంవత్సరాలుగా ఎస్‌యువీ టైర్ల కోసం డిమాండ్‌ను అందుకుంటున్నదని కాంటినెంటల్‌ టైర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సెంట్రల్‌ రీజియన్‌ బీఏ పీఎల్‌టీ ఆర్‌ఈ ఏపీఏసీ హెడ్‌ సమీర్‌ గుప్తా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img