Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

50 వేల మందికి శామ్‌సంగ్‌ శిక్షణ

హైదరాబాద్‌ : రాబోయే కొద్ది సంవత్సరాలలో ఎలక్ట్రానిక్స్‌ రీటైల్‌ రంగం కోసం 50,000 మంది యువతని ఉద్యోగానికి సిద్ధం చేసే సీఎస్‌ఆర్‌ లక్ష్యంతో ‘శామ్‌ సంగ్‌ దోస్త్‌’ (డిజిటల్‌ అండ్‌ ఆఫ్‌ లైన్‌ నైపుణ్యాల శిక్షణ)ను శామ్‌సంగ్‌ ఇండియా ప్రకటించింది. తమ దేశవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాలకు శిక్షణనిచ్చే కేంద్రాలు ద్వారా కార్యక్రమాన్ని అమలు చేయడానికి భారతదేశపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌, వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శామ్‌సంగ్‌, భారతదేశపు ప్రీమియర్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్‌ స్కిల్‌ డవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ డీసీ)తో భాగస్వామం చెందింది. శామ్‌సంగ్‌ దోస్త్‌ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అతి పెద్ద నైపుణ్యాల శిక్షణా కార్యక్రమం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img