Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

శామ్‌సంగ్‌ సాల్వ్‌ ఫర్‌ టుమారో ఇన్నోవేషన్‌ పోటీకి విశేష స్పందన

విశాలాంధ్ర/హైదరాబాద్‌: హైదరాబాద్‌లో శామ్‌సంగ్‌ ఇండియా నిర్వహించిన ఎడ్యుకేషన్‌, ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ ఇన్నోవేషన్‌ రోడ్‌ ప్రదర్శనలో కళాశాలకు చెందిన యువ విద్యార్థులు ముందుకు వచ్చి రాష్ట్రంలో, దేశంలో ప్రజలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు, సాల్వ్‌ ఫర్‌ టుమారో గురించి వాగ్థానం చేసారు. విద్య పరిమితంగా అందుబాటులో ఉండటం, నేర్చుకోవడానికి భాషా అడ్డంకులు, తీవ్రమైన కాలుష్యం, తయారీ, వ్యవసాయ అసమర్థతలు, ఆరోగ్య సంరక్షణ మద్దతు లేకపోవడం, పరిమితంగా వ్యవసాయ విజ్ఞానం వంటి పరిమితంగా అవకాశం ఉన్న వాస్తవిక ప్రపంచం సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నామని హైదరాబాద్‌లో విద్యార్థులు కోరుకున్నారు. తమ ఆలోచనలను చర్యలుగా మార్చటంలో తమకు సలహా ఇచ్చి, మద్దతు చేసే, ప్రజల జీవితాలను మార్చడంలో సహాయపడే శామ్‌సంగ్‌ వారి సాల్వ్‌ ఫర్‌ టుమారో ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పోటీ వంటి వేదికల్ని తాము కోరుకుంటున్నామని అన్నారు. సాల్వ్‌ ఫర్‌ టుమారో ఆరంభ ఎడిషన్‌లో విద్య, పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ రంగాల్లో 16-22 సంవత్సరాలకు చెందిన భారతదేశంలో యువత నుండి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. కార్యక్రమంలో పాల్గొనడానికి యువత తమ ఆలోచనలను జులై 31, 2022 వరకు పంపించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img