ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీయూడబ్ల్యూజె (APUWJ) వినతి
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కారానికి, సంక్షేమానికి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నరేంద్ర లు కోరారు. మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి, దేశవ్యాప్త జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ను పురస్కరించుకుని
శనివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డినీ ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృంద సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. వాటిని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు కోరుతున్న విధంగా మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జర్నలిస్టులు మీడియా సంస్థల భద్రతకు జాతీయస్థాయిలో ఒక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ కోసం వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు నారాయణ రెడ్డి, సహాయ కార్యదర్శి తారక, కోశాధికారి చంద్రబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, లావణ్య, రాజు, సుబ్రమణ్యం, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.