Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అల్లు శిరీష్‌ కొత్త చిత్రం ‘బడ్డీ’

హైదరాబాద్‌: హీరో అల్లు శిరీష్‌ తన తదుపరి చిత్రానికి సంబంధించిన వెల్లడిరచారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌లో ఆయన తదుపరి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘బడ్డీ’ అనే పేరును ఖరారు చేసి.. తాజాగా ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. రొటీన్‌ చిత్రాలు కాకుండా.. కాస్త వైవిధ్యమైన పాత్రలలో నటించే హీరోలలో అల్లు శిరీష్‌ ఒకరు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా తర్వాత అల్లు శిరీష్‌ చేస్తున్న చిత్రానికి ‘బడ్డీ’ అనే టైటిల్‌ని ఖరారు చేయడమే కాకుండా.. తాజాగా ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. టాప్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ స్టూడియో గ్రీన్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విషయానికి వస్తే.. అల్లు శిరీష్‌ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్‌ అతని పక్కన ఫైటింగ్‌ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్‌ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ లుక్‌ చూస్తుంటే.. ఇంతకు ముందు తమిళ హీరో ఆర్య నటించిన ‘టెడ్డీ’ సినిమా గుర్తుకు రాకమానదు. ఇది ఆ సినిమాకి సీక్వెలా? అనేలా ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img