Friday, April 26, 2024
Friday, April 26, 2024

పవన్‌కళ్యాణ్‌ ఓజీ నుంచి బ్లాస్టింగ్‌ వీడియో

హైదరాబాద్‌: పవన్‌కళ్యాణ్‌ లైనప్‌లో కాస్త ఎక్కువ ఎగ్‌జైట్‌మెంట్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ ఓజీనే. పవన్‌ అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎక్కడలేని బజ్‌ నెలకుంది. ఒక్క ప్రీ లుక్‌ పోస్టర్‌కే సోషల్‌ మీడియా షేక్‌ అయిందంటే ఏ రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ముంబైలో తొలి ఎపిసోడ్‌ను స్టార్ట్‌ చేశారు. ఇదే విషయాన్ని మేకర్స్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేస్తూ వెల్లడిరచారు. లేటెస్ట్‌గా రిలీజైన వీడియో గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌ కోసం దర్శకుడు సుజీత్‌ ఎంత హోం గ్రౌండ్‌ వర్క్‌ చేశాడో వీడియోలో వినూత్నంగా చూపించారు. ఇక ఈ వీడియోకు థమన్‌ అదిరిపోయే బ్యాగ్రౌండ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. కాగా పవన్‌ మాత్రం వచ్చే వారం నుంచి సెట్స్‌లో జాయిన్‌ అవుతాడని చిత్రబృందం వెల్లడిరచింది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్‌ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img