Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

‘బ్రో’ డిజిటల్‌ రైట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌గా పేరున్న పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా శుక్రవారం థియేటర్లలోకి విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఉదయం నుంచే పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ థియేటర్ల వద్ద పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో రచ్చ రచ్చ చేశారు. ఈ చిత్రంలో పవన్‌, సాయి తేజ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని మెప్పిస్తాయని చెబుతున్నారు. సినిమాలో మొదటి భాగం అంతా వినోదం, రెండో భాగమంతా భావోద్వేగాలతో నిండి ఉందం టున్నారు. ఈ చిత్రం వినోదయ సిత్తం అనే తమిళ్‌ సూపర్‌ హిట్‌ మూవీకి రీమేక్‌ గా తెరకెక్కింది. కాగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ దక్కించుకుంది. హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావడానికి 8 వారాల సమయం పడుతుంది. దీని ప్రకారం చూస్తే ఈ సినిమా సెప్టెంబరు చివరి వారంలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్స్‌ గా నటించారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూర్చారు. బ్రో సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ ప్లే అందించడంతోపాటు మాటలు కూడా రాశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, రోహిణి, తనికెళ్ల భరణి, అలీ రెజా తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img