Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గబ్బర్‌ సింగ్‌ దెబ్బ

పార్లమెంటు అర్ధరాత్రి సమావేశం కావడం మన పార్ల మెంటు చరిత్రలో రెండే రెండుసార్లు జరిగింది. మొదటిసారి దేశం స్వతంత్రమైనప్పుడు జరిగింది. మళ్లీ 2017 జులై ఒకటవ తేదీన నరేంద్ర మోదీ హయాంలో పార్లమెంటు అర్ధరాత్రి సమా వేశం అయింది. అప్పుడే వివాదాస్పదమైన, సంక్లిష్టమైన వస్తు సేవల పన్ను (జి.ఎస్‌.టి.) విధించారు. ఒకే దేశం, ఒకే పన్ను అన్న అందమైన నినాదం వినిపించారు. గోధుమలు, పాలు, పాలతో తయారు చేసే పదార్థాలు మొదలైన వాటి మీద పన్ను విధిం చడం ఎంత ఘోరమో చూడండి అని మోదీ అంతకు మునుపటి ప్రభుత్వాన్ని ఎగతాళి చేశారు. ఇప్పుడు సరిగ్గా అలాంటివే అనేక వస్తు వుల మీద జి.ఎస్‌.టి. విధించారు. కేంద్రంలో అధికారంలోకి రాక ముందు ఫలానా, ఫలాన వస్తువులపై పన్ను విధించడం ఎంత ఘోరం అని ఉద్వేగభరితంగా చెప్పారో వాటన్నింటిపైన ఇప్పుడు ఆ పన్ను విధిం చారు. ప్రతి అంశాన్ని మసి పూసి మారేడు కాయ చేయడంలో మోదీ సర్కారుది అందె వేసిన చేయి. నిత్యావసర సరుకులపై 5 నుంచి 12 శాతం జి.ఎస్‌.టి. విధించారు. మరికొన్నింటిపైనైతే 18 శాతం జి.ఎస్‌.టి. విధించారు. ఆసుపత్రి పడకలకు అంతకు ముందు జి.ఎస్‌.టి. ఉండేది కాదు. ఇప్పుడు రోజుకు రూ. 5000 వసూలు చేసే ఆసుపత్రి పడకలపై 5 శాతం జి.ఎస్‌.టి. విధించారు. వెయ్యి రూపాయలకన్నా తక్కువ అద్దె ఉండే హోటల్‌ గదుల్లో ఉండేవారు ఇంతకు ముందు ఈ పన్ను చెల్లించ వలసిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు 12 శాతం పన్ను వడ్డించారు. రోజుకు రూ. వెయ్యి తక్కువ అద్దె వసూలు చేసే హోటల్‌ గదుల్లో ఉండే వారు సాదాసీదా మామూలు మనుషులేగా! మోదీ సర్కారు ప్రత్యమ్నాయ ఇంధన వనరుల అవసరం గురించి అనునిత్యం ఊదర గొడ్తుంది. కానీ సౌర హీటర్ల మీద ఇంతవరకు 5 శాతం ఉన్న జి.ఎస్‌.టి.ని అమాంతం 12 శాతానికి పెంచేశారు. విద్యుత్తు తక్కువ ఖర్చై ఎక్కువ వెలుతురు ఇచ్చే ఎల్‌.ఇ.డి. బల్బులు తాము జనానికి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చాం అని సొంత డబ్బా వాయించుకున్న మోదీ ఇప్పుడు వాటి మీద జి.ఎస్‌.టి. 12 శాతం నుంచి ఏకంగా 18 శాతానికి పెంచింది. సామా న్యుడి వాహనమైన సైకిళ్ల మీద 12 శాతం పన్ను విధించిన సర్కారు కాస్త కలిగినవారు వినియోగించే ఎలక్ట్రిక్‌ సైకిళ్ల మీద 5 శాతం మాత్రమే పన్ను విధించింది. పెట్రోల్‌ ధరలు మండిపోతున్న స్థితిలో సైకిళ్లు వాడదాం అనుకున్న వారి మీద అధిక జి.ఎస్‌.టి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే. ఇంకా విచిత్రం ఏమిటే వజ్రాలు పొదిగిన నగల మీద 0.25 శాతం పన్నే విధించారు. సకల వస్తువుల ధరలు పెరుగుతూ, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతూ, నిరుద్యోగం పెరుగుతున్న విపత్కర పరిస్థితిలో మోదీ సర్కారు పనిగట్టుకుని సామాన్యుడి నడ్డి విరిచే రీతిలో ప్రవర్తిస్తోంది. అందరి తోడ్పాటు, అందరి అభివృద్ధి అన్న మోదీ నినాదంలోని డొల్ల తనాన్ని వివరించడానికి ఇంతకు మించిన ఉదాహరణలు ఉండవు.
చేసిన నష్టాన్ని గురించి చెప్పుకోవడంకన్నా చేయకుండా మిగిల్చిన నష్టం తమ ఘనతేనని వాదించడంలో మోదీ సర్కారును మించింది లేదు. ఒక వేపు పప్పులు, తృణధాన్యాలు, గోధుమలు, ఆవాలు, ఓట్స్‌, మొక్క జొన్నలు, బియ్యం, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, శెనగ పిండి, మొర్మొరాలు, పెరుగు మొదలైన వాటి మీద వస్తు సేవల పన్ను (జి.ఎస్‌.టి.) వేయలేదు చూడండి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ సమర్థించుకోవడం విచిత్రంగా ఉంది. అయితే వీటన్నింటినీ ప్యాక్‌ చేసి అమ్మితే జి.ఎస్‌.టి. వర్తిస్తుంది. విడిగా కొంటేనే జి.ఎస్‌.టి. ఉండదు. జి.ఎస్‌.టి.లాంటివి పరోక్ష పన్నులు. ఆదాయపు పన్ను చెల్లించే వారు మన దేశంలో కోటిన్నర మందే ఉన్నారని మోదీ బాధ. ఆదాయపు పన్ను చేల్లించే వారు కాస్త స్థితిమంతులు అనుకుందాం. కానీ తాజాగా విధించిన జి.ఎస్‌.టి. ప్రతి పౌరుడికీ వర్తిస్తుంది. పరోక్ష పన్నులు పెంచడంలో ఉన్న కిటుకు ఇదే. విలాసవంతమైన వస్తువుల మీద పన్ను పెంచకుండా సగటు జీవి కొనే వస్తువుల ధరలు పెంచే రీతిలో పన్ను విధించడం చూస్తే మోదీ కోరేది అందరి సంక్షేమం కాదు తన భజన పరులైన గుప్పెడు మంది ప్రయోజనాన్నే అని ఎవరికైనా అర్థం అవు తుంది. కానీ ఈ కష్టాలు గుర్తుకు రాకుండా మోదీ సర్కారు సామాన్యుడికి చిన్న చిన్న తాయిలాలు పెట్టడంతో పాటు హిందుత్వ మైకం కమ్మేట్టు చేసి సామాన్యుడు అసలు విషయం ఆలోచించకుండా చేస్తున్నది. జి.ఎస్‌.టి. వసూళ్లు 56 శాతం పెరిగినా ఇంకా వడ్డింపుల్లోని ఆంతర్యం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019లో కార్పొరేట్‌ పన్ను తగ్గించారు. తాజా వడ్డింపులపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జి.ఎస్‌.టి. మండలిలో ఉండేది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు 33 శాతం ఉంటారు. అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయికనక ఆ మంత్రులు ఎటూ నోరు మెదపలేరు. ప్రతిపక్షాల గొంతు అన్ని విషయాల్లోనూ చాలా పీలగానే ఉంది. అందుకని అధి కారంలో లేని ప్రతిపక్షాల వాణి జి.ఎస్‌.టి. లాంటి అంశాలలో వీధుల్లో వినిపించాల్సిందే తప్ప విధాన నిర్ణయాలు తీసుకునే చోట కాదు. ప్రభుత్వానికి ఆర్థిక వనరులే అవసరమైతే సంపన్నుల మీద పన్ను విధించాల్సింది. దానికి విరుద్ధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత సంపద పన్ను రద్దు చేశారు. సామాన్యుడి మీద కనికరమే ఉంటే సంపన్నులకు ఇచ్చిన రాయితీలు ఉపసంహరించవచ్చు. సంపద పన్ను విధించవచ్చు. కానీ మోదీకి అండగా ఉండేది, ఎన్నికల నిధులు సమ కూర్చేది వ్యాపార వర్గాలు, సంపన్నులే కనక వారి జోలికెళ్లరు. విలాస వస్తువులపై అధిక పన్ను, నిత్యావసర సరుకులపై తక్కువ జి.ఎస్‌.టి. విధిస్తామని చెప్పిన మాటను మోదీ సర్కారు విస్మరించడం ప్రయత్న పూర్వకమైందే.
జి.ఎస్‌.టి. వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని, స్థూల జాతీ యోత్పత్తి పెరుగుతుందని, నల్ల ధనం తగ్గుతుందని చేసిన వాగ్దానాలన్నీ గాలికి కొట్టుకు పోయాయి. తాజా వడ్డింపుల వల్ల ఎక్కువ నష్టపోయేది అసంఘటిత రంగం, సామాన్యులే. అసలు జి.ఎస్‌.టి. వ్యవహారమంతా గందరగోళమే. ఇప్పటికి 47 సార్లు జి.ఎస్‌.టి. మండలి సమావేశాలు జరిగాయి. వందలు వేల సంఖ్యలో ఉత్తర్వులు వెలువడ్డాయి. వాటన్నిం టినీ అర్థం చేసుకోవడమే పెద్ద పని. ఈ పన్ను వల్ల చిన్న వ్యాపారులు ఎప్పుడో దెబ్బ తిన్నారు. పరోక్ష పన్ను విధించేది ఒక వస్తువుపై అయితే దాని ప్రభావం మరెక్కడో కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img