Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

పెగాసస్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం మోదీకి అశనిపాతమే

సాంకేతిక పరిజ్ఞానం జన జీవితాన్ని సుఖమయం చేయ డానికి ఉపయోగపడినంత కాలం ఇబ్బంది లేదు. కానీ ఆ సాంకే తిక పరిజ్ఞానాన్ని దొంగ చాటుగా ప్రజల మీదే ప్రయోగించి వారి వ్యక్తిగత గోప్యతకు, మౌలిక హక్కులకు భంగం కలిగించడం ప్రజా స్వామ్యంలో ఆమోద యోగ్యం కాదు. పెగాసస్‌ వివాదం చెలరేగి నప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద గగ్గోలు మొదలైంది. పత్రికా రచ యితల నుంచి మొదలుకొని, ప్రత్యర్థి పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు, మానవ హక్కుల కోసం పాటు పడే కార్యకర్తలు కడకు కేంద్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే సీనియర్‌ అధికారులకు వ్యతి రేకంగా ఇజ్రాయిల్‌లోని ఒక సంస్థ తయారు చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అంగీకారయోగ్యం కాదు. పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న దుమారం రేగినప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత అన్న సాకులు చెప్తూ వచ్చింది. కానీ ఈ పరి జ్ఞానాన్ని వినియోగించలేదు అని ఒక్క మాట కూడా చెప్పలేక పోయింది. ఇది మౌనం అర్ధాంగీకారం లాంటిదే. కడకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనకు వెళ్లింది. సుప్రీంకోర్టు బుధవారం నాడు ఈ బ్రహ్మ రహస్యం ఛేదించే బాధ్యతను ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీకి అప్పగించింది. ఎనిమిది వారాల్లోగా నివేదిక అందించాలని కోరింది. అంటే ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి నివేదిక సుప్రీంకోర్టుకు అందాలి. అయితే డిసెంబర్‌ ఆఖరి వారంలో సుప్రీంకోర్టుకు సెలవులు ఉంటాయి కనక వచ్చే ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఈ నివేదికను పరిశీలించి ఉత్త ర్వులు జారీ చేయవచ్చు. వ్యక్తుల టెలీఫోన్‌ సంభాషణలను ప్రభుత్వ అధీనం లోని గూఢ చార సంస్థలు దొంగ చాటుగా వినే సంప్రదాయం మనకు ఇంతకు ముందు కూడా ఉంది. ఆ ఆరోపణల కారణంగానే చంద్రశేఖర్‌ ప్రభుత్వం పడిపోయింది. అయినా మోదీ సర్కారు మాత్రం ఈ విషయంలో పెదవి విప్పిన పాపాన పోలేదు. చివరకు సుప్రీంకోర్టు కలగజేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిరది. నిజానికి పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వాదనలు చేసిన వారినందరినీ ప్రభుత్వం జాతి వ్యతిరేకుల జాబితాలో చేర్చేసింది. మోదీ దుష్పరిపాలనపై అభ్యంతరం చెప్పే వారిని, తమకు కిట్టని రాజకీయ పార్టీల నాయకులను దేశద్రోహుల కింద జమ కట్టడం ఈ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. రాజీవ్‌ గాంధీ నాయకత్వంలో బోఫోర్స్‌ కుంభకోణం బయట పడ్డప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నానా యాగీ చేసింది. బోఫోర్స్‌ కుంభకోణంలో ఇమిడి ఉన్న డబ్బు కేవలం రూ.64 కోట్లు. ఈ ఆరోపణలు తీరా చూస్తే రుజువు కానే లేదు. అంత మాత్రం చేత కాంగ్రెస్‌ కడిగిన ముత్యం లాంటిదని చెప్పడం కాదు. ఒక వేళ ఆ ఆరోపణలు రుజువై ఉన్నా అది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు అవినీతికి పాల్ప డ్డారని తేలేదేమో. అవినీతి పంకిలంలో నుంచి ఈ దేశాన్ని బయటకు లాగు తామని శుష్క వాగ్దానాలు చేసిన మోదీ ప్రభుత్వం ఆ పని చేయలేక పోయింది. పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మోదీ సర్కారు దుర్వినియోగం చేసినట్టు రుజువు అవుతుందో లేదో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ మీద, ఒకవేళ సుప్రీంకోర్టు ఆ నివేదికను ఆమోదించి ఉత్తర్వు జారీ చేస్తుందా లేదా అన్న అంశంమీద ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు గుచ్చిగుచ్చి అడిగినా మోదీప్రభుత్వం పెగాసస్‌ వ్యవహారాన్ని తోసిపుచ్చుతూ వచ్చిందే తప్ప తాము వినియోగించామని కానీ వినియోగించలేదని కానీ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేదు. ప్రతి అంశాన్ని దేశ భద్రతకు ముడిపెట్టి సమా ధానం చెప్పకుండా తప్పించుకోవడం కుదరదని బుధవారం నాడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అధీనంలోని బెంచి స్పష్టం చేసింది. సుప్రీం కోర్టులో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడైనా ప్రభుత్వం మొండిగా నిరాక రించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చేయక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ప్రభుత్వం చేసే పనులు న్యాయ పరిశీలనకు అతీతమైనవని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. మన పరిపాలనా వ్యవస్థలో చట్ట సభలు, కార్య నిర్వాహక వర్గం (ప్రభుత్వం) చేసే పనులు, తీసుకునే చర్యలు న్యాయ పరిశీలన దగ్గ రకు వచ్చేటప్పటికి తలొగ్గాల్సిందే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పనిని మాజీ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారా లేదా అన్న ఒక్క మాటకు ప్రభుత్వం జవాబు చెప్పకుండా ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థలో కుదిరే పని కాదని సుప్రీంకోర్టు ఆదేశం వల్ల తేలిపోయింది.
సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి స్పష్టమైన కార ణాలే చూపించింది. ప్రజలకు ఉన్న రాజ్యాంగ దత్తమైన హక్కులను యధే చ్ఛగా ఉల్లంఘించడం కుదరదని నిర్మొహమాటంగానే చెప్పింది. ప్రభుత్వా నికి తగినంత సమయం ఇచ్చినా స్పందించనందుకు అత్యున్నత న్యాయ స్థానం అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ప్రభుత్వం సమర్పించిన ప్రమాణ పత్రం చాలా ‘‘పరిమితంగా ఉంది’’ అని కూడా న్యాయస్థానం చెప్పవలసి వచ్చింది. జాతీయ భద్రత మిషతో వాస్తవాలను కప్పిపుచ్చడాన్ని అంగీక రించడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా లేదని తేలిపోయింది. సుప్రీంకోర్టు నిర్ణయం మోదీ సర్కారుకు అత్యంత అననుకూల పరిస్థితుల్లో వెలువడిరది. మోదీ పలుకుబడి ఏ మాత్రం తగ్గలేదని టముకు వేసుకుంటున్నా ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి రాజుకుంటోంది. దీనికి తోడు రాజ్యాంగం ప్రకారం దక్కవలసిన హక్కులను కూడా కబళించే ప్రయత్నం చేయడాన్ని సహించేది లేదన్న సుప్రీంకోర్టు వైఖరి మోదీ ప్రభుత్వానికి అశనిపాతమే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన తరవాత దాన్ని న్యాయస్థానం పరిశీలించే సమయంలోనే బీజేపీ అయిదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచా రంలో నిమగ్నమై ఉంటుంది. ఆ మధ్యలో సుప్రీంకోర్టు కనక పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేసినట్టు ధ్రువీకరిస్తే అది మరింత ఇరకాటంలో పడవేయక తప్పదు. రాజ్యాంగం పూచీపడ్డ ప్రాథమిక హక్కు లను పరిరక్షించవలసిన బాధ్యత కచ్చితంగా సుప్రీంకోర్టుదే. గోప్యత సైతం ప్రాథమికహక్కుల్లో భాగమన్న స్పృహ ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. గోప్యత నిర్నిబంధమైంది కాకపోవచ్చు. దానికీ పరిమితులు ఉండవచ్చు. కానీ ప్రభుత్వం విధించే పరిమితులు రాజ్యాంగబద్ధమైనవి అయి ఉండవల సిందే. అనేక కిరాతక చట్టాల కింద ప్రభుత్వాన్ని నిలదీసే వారి మీద బూట కపు కేసులు మోపడం ఈ ప్రభుత్వానికి అలవాటై పోయింది. ప్రభుత్వాన్ని తప్పు పట్టే వారందరి మీద ఈ కిరాతక చట్టాలు ప్రయోగించి వారిని జైళ్లల్లో మగ్గేట్టు చేస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, పత్రికా రచయితలు, మానవ హక్కుల కోసం పాటు పడే కార్యకర్తలు కూడా ఉన్నారు. దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు అవీ కాకపోతే మావోయిస్టులు అన్న ముద్ర వేస్తూ మోదీ ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిర్ణయం ఉపకరించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img