Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అఫ్ఘానిస్తాన్‌-భారత్‌ మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాలి

భారత్‌కు తాలిబన్ల లేఖ

అఫ్ఘానిస్తాన్‌భారత్‌ మధ్య వైమానిక సేవలను పునరుద్ధరించాలని అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ల ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కోరింది. కాబూల్‌కు వాణిజ్య విమానాలను పునరుద్ధరించాలని కోరుతూ డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌)కు అప్ఘాన్‌ విమానయానశాఖ లేఖ రాసింది. ఈ లేఖను భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ సమీక్షిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ లేఖను సెప్టెంబరు 7నే పంపినట్లు తెలుస్తోంది. అఫ్ఘానిస్తాన్‌-భారత్‌మధ్య తిరిగి ప్రయాణ రాకపోకలు జరపాలని కోరుకుంటున్నాం. తమ కమర్షియల్‌ ఫ్లైట్స్‌ పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని అఫ్ఘానిస్థాన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ కోరుతోందని లేఖలో పేర్కొంది. అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల వశమైన తర్వాత కాబూల్‌కు వైమానిక సేవలను భారత దేశం నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రయాణికుల సంచారం సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ లేఖను రాస్తున్నట్లు ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆప్ఘానిస్థాన్‌ తెలిపింది. అఫ్ఘాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img