Monday, August 8, 2022
Monday, August 8, 2022

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని,అప్పులు.. ఖర్చులపై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. అంతా బాగుందని జగన్‌ ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. జగన్‌ దిగే నాటికి రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల మేర అప్పు ఉండడం ఖాయమన్నారు. అప్పులు చేస్తున్నారు.. కానీ అభివృద్ధి ఎక్కడా కన్పించడం లేదని అన్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, ఏపీ అభివృద్ధికి జగన్‌ సైంధవుడిలా అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. విలీన మండలాల్లోని ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని తీర్మానం చేశారంటే.. సీఎం జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలని రామకృష్ణ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img