Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

ఒడిశాలో వర్షాలు..ఇద్దరు మృతి

భారీ వర్షాలకు ఒడిశా రాష్ట్రంలో పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. 87 ఏండ్ల తర్వాత 55.5 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రపడలో గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.వర్షాల నేపథ్యంలో ఒడిశాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా, ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img