Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కదం తొక్కిన రైతన్నలు

కేంద్రం తీసుకొచ్చిన కొత్తసాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రైతన్నలు మరోసారి కదం తొక్కారు.కిసాన్‌ సంసద్‌ పేరుతో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దిల్లీలోని జంతర్‌మంతర్‌కు బస్సుల్లో ర్యాలీగా వచ్చారు. ఇప్పటికే సింఘు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. పోలీసు ఎస్కార్ట్‌ మధ్య 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపడుతున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని దిల్ల్లీ ప్రభుత్వం నిన్న అనుమతినిచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img