Friday, April 26, 2024
Friday, April 26, 2024

శరవేగంగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి

డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కరోనా డెల్టా వేరియంట్‌ వ్యాప్తిచెందుతోందని, ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వైరస్‌ విజృంభణ తారస్థాయికి చేరుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తంచేసింది.ఇప్పటికే 124 దేశాలకు డెల్టా పాకిందని వెల్లడిరచింది. ఈ వారం కొత్తగా 13 దేశాల్లో డెల్టా కేసులు నమోదైనట్లు పేర్కొంది.గడిచిన నాలుగు వారాల్లో నమోదైన కేసుల్లో 75శాతానికి పైగా కేసులు డెల్టావేనని స్పష్టం చేసింది. భారత్‌ సహా బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, సింగపూర్‌, ఇండోనేషియా, రష్యా, చైనాలో నమోదైన కొత్త కరోనా కేసుల్లో డెల్టావే 75 శాతం కంటే అధికంగా ఉన్నాయని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img