Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు డీఏ పెంపు

జులై నుంచి అమలు
ఏడాది తర్వాత కేబినెట్‌ ప్రత్యక్ష భేటీలో కీలక నిర్ణయాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న తరుణంలో మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ బుధవారం భేటీ అయింది. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులంతా హాజరయ్యారు. మంత్రివర్గం, కేబినెట్‌ కమిటీల పునర్వవస్థీకరణ తర్వాత మంత్రులంతా తొలిసారి భేటీ అయ్యారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ

పెంపు, పశుసంవర్థక, డెయిరీ పథకాల పున:రూపకల్పన, టెక్స్‌టైల్‌ ఎగుమతిదారుల కోసం ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ పొడిగింపు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, పెంచిన డీఏ జులై నుంచి అమలు అవుతుందని వెల్లడిరచారు. గత ఏడాది పెంచిన డీఏను నిలిపివేస్తూ వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు డీఏను పెంచుతున్నట్లు తెలిపారు. తాజా పెంపుదలతో 48.34లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 65.26లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుందని ఠాకూర్‌ అన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గడం, సాంఫీుక సంక్షేమ పథకాలపై వ్యయం పెరిగిన నేపథ్యంలో గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు డీఏ, డీఆర్‌లను నిలిపివేశారు. మొత్తంగా మూడు విడతల డీఏ పెండిరగ్‌లో ఉంది. 2020, జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు- 4శాతం, జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు 3 శాతం, 2021, జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకు 4 శాతం చొప్పున డీఏ పెండిరగ్‌ ఉంది.
‘ఓబీసీ’ కమిషన్‌ కాలపరిమితి పొడిగింపు
ఓబీసీ ఉప వర్గీకరణ నేపథ్య అంశాల పరిశీలనకు ఏర్పాటైన కమిషన్‌ కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగించడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జులై 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 31 వరకు కమిషన్‌ కాలపరిమితిని పెంచింది. రాజ్యాంగంలోని అధికరణ 340 కింద ఏర్పాటైన ఈ కమిషన్‌ కాలపరిమితిని పొడిగించడం ఇది 11వ సారి. రాష్ట్రపతి ఆమోదంతో దీనిని నోటిఫై చేస్తామని కేంద్రం ప్రకటించింది.
పశుసంవర్థక శాఖ, డెయిరీ పథకాలపై పున:సమీక్ష
పశుసంవర్థక శాఖ, డెయిరీ పథకాలపై పున:సమీక్ష నిర్వహించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) భేటీలో నిర్ణయం జరిగింది. పశుసంవర్థక శాఖలోని అనేక అంశాలను పున:సమీక్షించడానికి, పున:రూపకల్పనకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. అలాగే డెయిరీ పథకాలు, ప్రత్యేక పశువుల ప్యాకేజిపైనా సమీక్షకు అంగీకరించిందని అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించింది. ఇందుకోసం రూ.54,618 కోట్ల పెట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఐదేళ్లలో రూ.9,800 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తుందని ట్వీట్‌ పేర్కొంది. ఈ శాఖ పథకాలన్నీ సమీక్షించిన తర్వాత మూడు వర్గాలుగా విభిజించారు. మొదటి కేటగిరిలో అభివృద్ధి పథకాలు ఉంటాయి. ఇందులో రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌, నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ (ఎన్‌పీడీడీ), నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌ (ఎన్‌ఎల్‌ఎం), లైవ్‌స్టాక్‌ సెన్సస్‌, ఇంటిగ్రేటెడ్‌ శాంపిల్‌ సర్వే (ఎల్‌సీఐఎస్‌ఎస్‌)లు ఉప పథకాలుగా ఉంటాయి. రెండవ వర్గంలో రోగ నిరోధక కార్యక్రమాలు ఉంటాయి. పశువుల ఆరోగ్యం, రోగ నియంత్రణ (ఎల్‌హెచ్‌ Ê డీసీ)లో ప్రస్తుత ఎల్‌హెచ్‌ Ê డీసీ పథకంతో పాటు జాతీయ పశువుల రోగాల నిరోధక కార్యక్రమం (ఎన్‌ఏడీసీపీ) ఉంటాయి. మూడవ కేటగిరిలో మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఉంటుంది. ఇందులో పశుసంవర్థక మౌలికాభివృద్ధి నిధి (ఏహెచ్‌ఐడీఎఫ్‌), డెయిరీ మౌలికాభివృద్ధి నిధి (డీఐడీఎఫ్‌)లు విలీనమై ఉంటాయి. సమీక్ష, విలీనాల తర్వాత రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి చర్యలు ఉంటాయి. 8,900 భారీ మిల్క్‌కూలర్లను నెలకొల్పి ఎనిమిది లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఎన్‌పీడీడీ పథకం ఉంది. రోజుకు 20లక్షల లీటర్ల పాలను అదనంగా సేకరిస్తారు. ఎన్‌పీడీడీ కింద జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఐ) నుంచి ఆర్థిక సాయం ఉంటుంది. తద్వారా 4500 గ్రామాల బలోపేతం, అభివృద్ధి, మౌలికాభివృద్ధి జరుగుతుందని అధికారిక ప్రకటన వెల్లడిరచింది. భారత్‌డెన్మార్క్‌ మధ్య వైద్యారోగ్య ఒప్పందం
వైద్యారోగ్య రంగంలో సహకారానికిగాను భారత్‌కు, కింగ్‌డమ్‌ ఆఫ్‌ డెన్మార్క్‌కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇరు దేశాల వైద్యారోగ్య శాఖ మధ్య సయోధ్యకు ఈ ఒప్పందం దోహదపడుతుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఆరోగ్య రంగంలో టెక్నాలజీ అభివృద్ధి, సంయుక్త కార్యక్రమాలకు ఇది ఆస్కారం కల్పిస్తుందని పేర్కొంది. రెండు దేశాల ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుదలకూ ఉపయుక్తంగా ఉంటుందని ప్రకటన వెల్లడిరచింది.
2024 మార్చి 31 వరకు ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌
ఎగుమతులపై కేంద్ర, రాష్ట్ర పన్నుల రిబేట్లను టెక్స్‌ట్రైల్‌ వాణిజ్యవేత్తలు పొందే ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌ పథకాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్‌ రంగంలో పోటీని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
వస్త్రాల ఎగుమతులపై టెక్స్‌టైల్‌ మంత్రిత్వశాఖ నోటిఫై చేసిన రాష్ట్ర, కేంద్ర పన్నులు, లెవీలపై రిబేట్‌ (ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌) రేట్లు కొనసాగుతాయని, ఈ పథకం 2024, మార్చి 31 వరకు అమలవుతుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడిరచారు.
2026 వరకు ఆయుష్‌ మిషన్‌ కొనసాగింపు
జాతీయ ఆయుష్‌ మిషన్‌ను మరో ఐదేళ్లు అంటే 2026 వరకు కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు ఠాకూర్‌ తెలిపారు. 2021, ఏప్రిల్‌ 1 నుంచి 2025, మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగుతుందని అన్నారు. ఆ కాలంలో మొత్తం రూ.4,607.30కోట్ల వ్యయ అంచనా ఉన్నట్లు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img