Monday, August 8, 2022
Monday, August 8, 2022

చెత్త పన్నుకు నిరసన

విజయవాడలో లెఫ్ట్‌ నేతల అక్రమ నిర్బంధం

జీవో 198 రద్దు చేసే వరకు పోరాడతామన్న నాయకులు
వైసీపీ కార్పొరేటర్ల ఇళ్లు ముట్టడిస్తాం : దోనేపూడి శంకర్‌

విశాలాంధ్ర`విజయవాడ :
విజయవాడ పోలీసుల తీరులో ఏ మార్పు లేదు. పౌరహక్కులను కాపాడాలని నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. కనీసం నిరసన తెలియజేసే అవకా శం కూడా ఇవ్వకుండా సీపీఐ, సీపీఎం నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధి ంచారు. ప్రజలపై భారాలు మోపవద్దని ధర్నా చేసేందుకు వచ్చిన సీపీఐ, సీపీఎం నేతలను బలవ ంతంగా పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలీసులు, అధికారపక్షం తీరుపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలు మోపేందుకు జారీ చేసిన జీవో 198ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. జీవో 198పై చర్చించేందుకు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించింది. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచడం వల్ల నగర ప్రజలపై పెనుభారం పడుతుందని, కౌన్సిల్‌ సమావేశంలో జీవో 198ను

అమలు చేయబోమని తీర్మానం చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం అధ్వర్యాన నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని నిర్ణయిం చారు. ఈ విషయం తెలిసి పోలీసులు కార్పొ రేషన్‌ కార్యాలయం నలువైపులా భారీగా మోహరించారు. రోడ్లు మూసివేశారు. అయినప్పటికీ సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు సహా సీపీఎం నాయకులు సీహెచ్‌ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌, రెండు పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు కొద్ది నిమిషాల్లోనే వారిని బలవంతంగా అరెస్ట్‌ చేసి గవర్నర్‌పేట, కృష్ణలంక పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌కు, మేయర్‌కు, మంత్రులు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో 198 రద్దు చేయాలని డిమాండు చేశారు. నగరంలో 1.90లక్షలకు పైగా అసెస్‌మెంట్లు ఉన్నాయని, ప్రజలపై రూ.400 కోట్లకు పైగా భారం పడుతుం దని చెప్పారు. కౌన్సిల్‌లో సంఖ్యాబలం ఉందని 198 జీవోను ఆమోదిస్తే, రానున్న రోజుల్లో మేయర్‌, మంత్రులు, వైసీపీ కార్పొరేటర్ల ఇళ్లను ముట్టడి స్తామని హెచ్చరించారు. ప్రజలపై భారం మోపే జీవోలను రద్దు చేసే వరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పోరాటం కొనసాగిస్తాయన్నారు. కనీసం నిరసన తెలియజేసేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేసిన పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీ సులు అరెస్టు చేసినవారిలో సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యుడు లంక దుర్గారావు, కార్యవర్గ సభ్యులు డీవీ రమణబాబు, తాడి పైడియ్య, అప్పురబోతు రాము, సం గుల పేరయ్య, కేవీ భాస్కరరావు, కొట్టు రమణారావు, తూనం వీరయ్య, కొడాలి ఆనందరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు మూలి సాంబశివరావు, టి.తాతయ్య, ముఠా కార్మికసంఘం నాయకుడు వియ్యపు నాగేశ్వరరావు, మహిళా సమాఖ్య నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ, డివిజన్‌ కార్యదర్శులు కె.కోటేశ్వరరావు, పడాల కనకారావు, గంధవరపు వెంకట్రా వ్‌, తిప్పాబత్తుల వెంకటేశ్వరరావు, పగిడికత్తుల రాము, కె.వాసు, షేక్‌ సుభానీ, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు గూడెల జనార్ధన్‌, సీపీఐ నాయకులు కాళ్ల చిన్నప్ప, డి.సూరిబాబు, రాయన గురునాథం, సోమేశ్వరరావు, మురుగేషన్‌ రాము, మహిళా నాయకులు దుర్గాశి రమణమ్మ తదితరులు ఉన్నారు. సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా సూర్యారావు, బుట్టి రాయప్ప, నక్కా వీరభద్ర రావు, డివిజన్‌ కార్యదర్శులు సింగరాజు సాంబశివరావు, షేక్‌ సుభానీ, సీపీఐ నాయకులు బెవర శ్రీను, శివ, చింతల శ్రీను, పందిరి నూకరాజు పాల్గొన్నారు.
అరెస్టులు తగదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఆస్తి, చెత్త పన్నుల పెంపుదలకు సిద్ధమైన విజయవాడ నగరపాలక సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత నిరసన చేపట్టిన సీపీఐ, సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. అసలే కరోనా విపత్తు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఆస్తి, చెత్త పన్నుల భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవ్వడం విచారకరమన్నారు. ఇంటి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచే విధానానికి నిరసనగా విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద సీపీఐ, సీపీఎం ఆందోళన చేపట్టగా 70 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టులుచేసి కృష్ణలంక, గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లకు తరలించారన్నారు. కేంద్ర ప్రభుత్వ షరతులకు తలొగ్గి సీఎం జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పన్నుల భారాలు మోపేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండిరచాలని కోరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img