Friday, September 30, 2022
Friday, September 30, 2022

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కర్‌ ఈ తోయిబా-ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒకరిని ముఖ్తర్‌ షాగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిరచడం జరుగుతుందని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, సోమవారం ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్‌లోని తుల్‌రాన్‌, ఇమామ్‌సహాబ్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img