Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కొత్తగా 18,987 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ముందురోజు 15,823 కేసులు నమోదవగా, తాజాగా అవి 18 వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 18,987 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730కు చేరింది. ఇందులో 3,33,62,709 మంది బాధితులు కోలుకోగా, 2,06,586 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారినపడి మరో 4,51,435 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో మరో 19,808 మంది కోలుకోగా, 246 మంది మృతిచెందారు.. దేశవ్యాప్తంగా 34,66,347 మంది కరోనా టీకా తీసుకున్నారని వెల్లడిరచింది. దీంతో దేశంలో మొత్తం 96,82,20,997 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.అక్టోబర్‌ 13 నాటికి 58,76,64,525 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 13,01,083 మందికి పరీక్షలు చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img