Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

దేశంలో కొత్తగా 31,222 పాజిటివ్‌ కేసులు

290 కరోనా మరణాలు
దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా..290 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 3,92,864 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,30,58,843కు చేరింది. ఇప్పటి వరకు 3,22,24,937 మంది కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,41,042కు చేరింది. ఇప్పటి వరకు 69,90,62,776 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే కేరళలో 19,688 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా..135 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img