Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

నితీశ్‌ బలపరీక్షకు ముందు.. బీహార్‌లో నాటకీయ పరిణామాలు.. స్పీకర్‌ రాజీనామా

బీజేపీకి కటీఫ్‌ చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నేడు (ఆగస్టు 24న) అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. ఆర్జేడీ మద్దతుతో జేడీయూ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి 165 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటేస్తారని నితీశ్‌ కుమార్‌ ధీమాగా ఉన్నారు. కానీ బలపరీక్షకు ముందు బీహార్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నితీశ్‌ ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుండగా.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతల నివాసాలపై సీబీఐ బుధవారం దాడులు చేసింది. దిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌ జిల్లాలోని 16 చోట్ల సీబీఐ దాడులు చేసింది.
నితీశ్‌ కుమార్‌ సర్కారు బలపరీక్షకు ముందే.. అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తొలుత రాజీనామా చేసేది లేదని స్పష్టం చేసిన విజయ్‌ కుమార్‌ సిన్హా.. బుధవారం ఎట్టకేలకు స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం స్పష్టంగా లేదన్నారు. అవిశ్వాసం తీర్మానం కోసం 9 మంది సభ్యుల నుంచి తనకు అందిన లేఖల్లో 8 నిబంధనల ప్రకారం లేవన్నారు.ప్రభుత్వం మధ్యంతరంగా మారినప్పుడు స్పీకర్‌ కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కానీ జేడీయూ ఆధ్వర్యంలో మహాగట్‌బంధన్‌ ప్రభుత్వం బీహార్లో అధికారంలోకి వచ్చి రెండు వారాలైనా సిన్హా రాజీనామా చేయడానికి అంగీకరించలేదు. దీంతో బీజేపీ నుంచి వచ్చిన సిన్హాపై జేడీయూ, ఆర్జేడీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆగస్టు 10న అసెంబ్లీ సెక్రటేరియట్‌కు తీర్మానాన్ని అందించగా.. ఆర్జేడీ, జేడీయూ, సీపీఐ (ఎంఎల్‌) పార్టీకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలు తీర్మానంపై సంతకం చేశారు. సిన్హా స్పీకర్‌ పదవికి రాజీనామా చేయడంతో.. నితీశ్‌ ప్రభుత్వం బలనిరూపణ సజావుగా జరిగే అవకాశం ఉంది. బీహార్‌ అసెంబ్లీలో 243 స్థానాలు ఉండగా.. అందులో సగం అంటే 122 సీట్లు వస్తే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకుంటుంది. కానీ మహాగట్‌బంధన్‌ ప్రభుత్వానికి 165 మంది సభ్యుల బలం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img