Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

పోలీసు అమరవీరులకు ప్రధాని ఘననివాళి..

దేశవ్యాప్తంగా ఇవాళ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు బలగాల సేవలు అమోఘమని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు పోలీసులు అందిస్తున్న సేవలను విస్మరించలేమని ప్రధాని ట్వీట్‌ చేశారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img