Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

ప్రజావ్యతిరేక విధానాలు తిప్పికొట్టండి

27న భారత్‌ బంద్‌ జయప్రదం చేయండి
12న మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ దినం
సీపీఐ కార్యవర్గం పిలుపు

న్యూదిల్లీ : కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌ అన్ని విధాలుగా సంక్షోభాలను ఎదుర్కొంటోందని సీపీఐ వ్యాఖ్యా నించింది. కులంమతంజాతి పేరిట రాజకీ యాలు చేస్తూ హిందూత్వ అజెండాతో బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు సాగుతున్నాయని దుయ్య బట్టింది. ఇటువంటి ప్రజాకార్మిక`కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. మైనారిటీలు, గిరిజనులపై దమనకాండ కొనసాగుతోందని, మహిళల్లో అభద్రతాభావం పెరుగుతోందని, యువత నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. కేంద్రం తీసుకు వచ్చిన వివాదాస్పద మూడు కొత్త సాగు చట్టాల వ్యతిరేక రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తూ 27న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ఈ నెల 4,5 తేదీల్లో దిల్లీ అజయ్‌భవన్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముగింపు సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రసంగించారు. రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై నివేదికను సమర్పించారు. దీనిపై చర్చించి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం అజయ్‌భవన్‌లో రాజా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సమావేశం నిర్ణయాలను వివరించారు. ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు ప్రచారానికి 19 విపక్షాలు పిలుపునివ్వగా అందులో సీపీఐ క్రియాశీలంగా పాల్గోనున్నట్లు సమావేశం తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ, రక్షణ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్రేడ్‌ యూనియన్లకు అండగా

నిలవనుంది. కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల లేబర్‌ కోడ్‌ల అమలును ప్రతిఘటిస్తామని పేర్కొంది. దేశద్రోహం, యూఏపీఏ చట్టాల దుర్వినియోగాన్ని తక్షణమే ఆపేయాలని, తప్పుడు అభియోగాలతో సామాజిక, రాజకీయ కార్యక ర్తలపై వేధింపులను నిలువరించాలని డిమాండు చేసింది. సమాఖ్యవిధానాన్ని నీరుగార్చే చర్యలను మానుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రజలకు సీపీఐ పిలుపునిచ్చింది. కులగణనకు మద్దతి చ్చింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు 25ఏళ్లు అని గుర్తు చేసింది. ఈ బిల్లు కోసం సీపీఐ ఎంపీ గీతాముఖర్జీ తీవ్రంగా పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేసింది. సెప్టెంబరు 12న ‘మహిళా రిజర్వేషన్‌ డిమాండు దినం’గా పాటిం చాలని నిర్ణయించింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడిరచాలని కమ్యూనిస్టు పార్టీ సంకల్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కలపై సమీక్షించింది. సీపీఐ తదుపరి మహా సభను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించాలని హైదరా బాద్‌లో జరిగిన జాతీయ సమితి సమా వేశం నిర్ణయించగా ఇందుకు సంబంధించిన తేదీలు తదితర నిర్ణయాలను తీసుకునేందుకు అక్టోబరు 2,3,4 తేదీల్లో న్యూదిల్లీలో జాతీయ సమితి సమావేశం కానుంది. కాగా, ఈ ఏడాది జనవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో జాతీయ సమితి భేటీ అయి జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు పార్టీ వ్యవహారాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించింది. ఆ తర్వాత దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ చోటుచేసుకున్న అనేక పరిణామాలపై పార్టీ సమీక్షించింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూనే ఉందని, కొనుగోలు శక్తిడిమాండు పడిపో వడంతో పరిస్థితి జఠిలమైనట్లు గుర్తుచేసింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అనిశ్చితి, నిరు ద్యోగిత తారాస్థాయికి చేరింది. పార్లమెంటు, పార్లమెంటు వ్యవస్థలు సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఫెడరలిజం స్ఫూర్తి మరుగున పడిపోతోంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కనిపిస్తోంది. వ్యవస్థలు బలహీనపడిపోతున్నాయి. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ విభజించి పాలించి సిద్ధాంతంతో దూకుడు ప్రదర్శిస్తోంది. మతచిచ్చు రగుల్చుతూ స్వలాభం దిశగా ముందుకు వెళుతోంది. లౌకికవాదాన్ని, సామాజికవాదాన్ని తూట్లు పొడుస్తోంది. దేశద్రోహం చట్టం దుర్వినియోగం, భావ ప్రకటన, వాక్‌ స్వేచ్ఛపై దాడులు, లవ్‌ జిహాద్‌ పేరిట శాసనాలు చేసింది. కులం, మతం పేరిట ప్రజలను విభజించాలని చూస్తోంది. శ్రామికులు, కార్మికులు, కర్షకులు, రైతులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులకు వ్యతిరేకంగా విధానాలను అమల్లోకి తెస్తోంది. మహిళలపై వ్యవస్థాగతమైన అణచివేత కొనసాగుతోంది. వారిలో అభద్రతా భావన పెరుగుతోంది. పిల్లలు, యువత భవిష్యత్‌ అనిశ్చితిలో పడిపోతోంది. ఇలాంటి అస్థవ్యస్థ పరిస్థితుల్లో ప్రగతిశీల, లౌకిక, సమసమాజ దృక్పథం దృష్ట్యా కార్యచరణ ఎంతైనా అవసరమని సీపీఐ పేర్కొంది.
తీర్మానాలు : సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 27న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఐ తీర్మానించింది. రైతుల ఉద్యమానికి సంఫీుభావం తెలపాలని ప్రజలను కోరింది. అప్రజాస్వా మికంగా ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సాగు చట్టాల రద్దు డిమాండుతో దేశ రాజధాని సరి హద్దుల్లో అన్నదాతలు పోరాడుతున్నారని తెలిపింది. ఈ చట్టాలు కార్పొరేట్లకు అనుకూలం అన్నదాతలకు వ్యతిరేక మని, సేద్యాన్ని నాశనం చేసే నల్ల చట్టాలని, వీటి అమ లుతో కోట్లాది రైతుల జీవితాలు అగాధంలో పడతాయని సీపీఐ పేర్కొంది. భారత్‌ బంద్‌ చరిత్రాత్మక విజయాన్ని కాంక్షించింది. అలాగే జాతీయ అస్తుల విక్రయాన్ని ప్రతిఘటిస్తామని పేర్కొంది. కేంద్రప్రభుత్వ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రైవేటీకరణను వ్యతిరేకించింది. సమాజంలోని అన్ని వర్గాలకు వ్యతిరేకంగా కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న విధానాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img