Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

బెంగాల్‌ మంత్రి పార్థ అరెస్టు

అదుపులో ఆయన అనుచరురాలు అర్పిత
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ఈడీ చర్యలు

కోల్‌కతా: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్‌కతాలోని మంత్రి నివాసంలో అధికారులు 23 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ సమయంలో ఆయన సహకరించలేదని, దాంతో ఆయన్ను అరెస్టు చేశామని ఈడీ వెల్లడిరచింది. మంత్రి అనుచరురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో శుక్రవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది. ఆమెను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. పార్థ ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగా యన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ఆరోపణలతో శుక్రవారం ఈడీ అధికా రులు మంత్రి, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యామంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పార్థ ఛటర్జీ విద్యాశాఖమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పీకే బందోపాధ్యాయ, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య తదితరుల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధిం చిందేనని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం కూడా అర్పిత నివాసంలో సోదాలు జరిగాయి. అనేక ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.
తృణమూల్‌ మండిపాటు
మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. రాజకీయ దురుద్ధేశంతోనే తమ నాయకులను అరెస్టు చేస్తున్నట్లు విమర్శించింది. రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపించింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ నాయకుడిని అరెస్టు చేసినట్లు తెలిపింది. మోదీ సర్కారు చర్యలకు భయపడేది లేదని స్పష్టంచేసింది.
ఇది ఆరంభమే: బీజేపీ
ఈడీ దాడుల నేపథ్యంలో బీజేపీ రెండు ఫొటోలు షేర్‌ చేసి, తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. ఆ ఫొటోల్లో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రి ఛటర్జీతో అర్పిత దర్శనమిచ్చారు. ఇది ట్రైలర్‌ మాత్రమే.. అసలు చిత్రం ముందుందంటూ బీజేపీ నేత సువేందు అధికారి ఈ చిత్రాలను పోస్టు చేశారు. ఇదిలా ఉండగా.. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ మరుసటి రోజే ఈడీ దాడులు చేయడం వెనుక తమ నాయకులను వేధించాలన్నదే ఈడీ వ్యూహంగా ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img