Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

దేశంలో ఘనంగా రంజాన్‌ వేడుకలు

దేశవ్యాప్తంగా రంజాన్‌ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాదాపు రెండేండ్ల తర్వాత… మళ్లీ దేశంలోని అన్ని మసీదులు ముస్లిం సోదరులతో కళకళలాడుతున్నాయి. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్‌ పర్వదినం వేళ దిల్లీలోని జామా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.రంజాన్‌ వేడుకల నేపథ్యంలో దిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. జామా మసీదు పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంజాన్‌ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, శాంతి భద్రతలు పాటించాలని దిల్లీ పోలీసులు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img