Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

మూడు రాజధానులే మా విధానం.. బొత్స

మూడు రాజధానులే తమ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్‌ విమర్శలకు కౌంటర్‌ గా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ విధానం వికేంద్రీకరణే అన్నారు. 26 జిల్లాలో డెవలప్‌ మెంటే తమ విధానమన్నారు. సెలబ్రెటీ పార్టీ నేత ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అన్నీ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారన్నారు. తనకే అంతా తెలుసన్నట్లుగా ఏదేదో చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని డెవలప్‌ చేస్తుంటే పవన్‌ కు ఏంటీ బాధ అని బొత్స ప్రశ్నించారు. సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నావని ఆయన పవన్‌ను ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img